తెరపైకి వాస్తవాలు? సిక్కు హత్య కేసులో టైట్లర్​ విచారణ

The facts on the screen? Tytler trial in Sikh murder case

Sep 13, 2024 - 19:08
 0
తెరపైకి వాస్తవాలు? సిక్కు హత్య కేసులో టైట్లర్​ విచారణ
రౌస్​ అవెన్యూ కోర్టు ఆదేశాలు
నాలుగు దశాబ్దాల కేసుపై పునర్విచారణ
వాంగ్మూలాలు ఇచ్చేందుకు సాక్ష్యులు సిద్ధం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సిక్కు హత్యలు (1984) కేసులో కాంగ్రెస్​ నాయకుడు జగదీష్​ టైట్లర్​ ను విచారించాలని రౌస్​ అవెన్యూ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దీంతో నాలుగు దశాబ్దాల ఈకేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొంది. గురుద్వారా పుల్​ బంగాష్​ సమీపంలో ముగ్గురు సిక్కులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో అప్పట్లో అభియోగాలు మోపిన వాటి నుంచి బయటపడ్డారు. సాక్ష్యులు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఈ కేసును తిరిగి విచారించనున్నారు. 
 
హత్యలపై జగదీష్​ టైట్లర్​ పై 143, 147, 188, 153 ఎ ఐపీసీ, 295, 436, 451, 380 సెక్షన్లతోపాటు ఐపీసీ 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 
 
ఈ కేసుపై సీబీఐ 2023న జగదీష్​ టైట్లర్​ పై అనుబంధ చార్జీ షీటు కూడా దాఖలు చేసింది. ఈ చార్జీ షీట్​ ఆధారంగానే తిరిగి కేసు పూర్వాపరాలపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 
 
తొలుత ఈ కేసును జస్టిస్​ నానావతి కమిషన్​ విచారించింది. 2005 తరువాత సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడిలో ఠాకూర్​ సింగ్​, బాదల్​ సింగ్​, గురుచరణ్​ సింగ్​ అనే ముగ్గురు హత్యకు గురయ్యారు. దీనికి కారణం టైట్లర్​ గుంపును రెచ్చగొట్టడం వల్లే జరిగిందనే ఆరోపణలున్నాయి. 
 
కేసు విచారణ తెరపైకి రావడంతో అప్పట్లో వాస్తవంగా ఏమి జరిగిందనేది తెలిసే అవకాశం ఉంది.