హిందువుల జనాభా తగ్గుదల ముస్లింల జనాభాలో భారీ పెరుగుదల
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక విడుదల
నా తెలంగాణ, న్యూఢిల్లీ: భారతదేశంలో హిందువుల జనాభా తగ్గింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాల జనాభాపై అధ్యయనం చేసింది. ఈ నివేదిక ను గురువారం విడుదల చేసింది.
నివేదిక ప్రకారం, భారతదేశంలో హిందువుల జనాభాలో 7.8 శాతం క్షీణత చోటు చేసుకుంది. ముస్లింల జనాభా వాటా 43 శాతం పెరిగింది. హిందువుల జనాభా వాటా 1950, 2015 మధ్యకాలంలో 7.8శాతం గణనీయంగా తగ్గింది. అయితే భారత్ పొరుగు దేశాలలో ముస్లిం మెజారిటీ కమ్యూనిటీ జనాభాలో పెరుగుదల నమోదైంది.
ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా ఇతర మైనారిటీల జనాభా వాటా పెరిగింది. అయితే జైనులు, పార్సీల సంఖ్య తగ్గింది. 1950, 2015 మధ్య కాలంలో, భారతదేశంలో ముస్లిం జనాభా 43.15శాతం పెరిగింది, క్రైస్తవులు 5.38, సిక్కులు 6.58శాతం, బౌద్ధులు స్వల్పంగా పెరిగారు. అయితే ముస్లిం దేశాలలోని హిందువుల సంఖ్య భారీగా తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.