మహాలో సీట్ల పంచాయతీ కాంగ్రెస్​–కూటమి మధ్య ఉద్రిక్తతలు

Tensions between Congress-Kutham alliance in Mahalo seats

Oct 18, 2024 - 13:06
 0
మహాలో సీట్ల పంచాయతీ కాంగ్రెస్​–కూటమి మధ్య ఉద్రిక్తతలు
రాహుల్​ గాంధీతోనే తేల్చుకుంటామంటున్న శివసేన, యూబీటీ, ఎన్సీపీ
తలొగ్గితే నష్టం తప్పదంటున్న అధ్యక్షుడు నానా పటోలే
ముంబాయి: మహారాష్ట్ర సీట్ల పంపకాలపై కాంగ్రెస్​–శివసేన మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సీట్ల పంచాయతీ తేలకపోవడంతో మహా వికాస్​ అఘాడి, యుబిటీ, శరద్​ పవార్​ లు రాహుల్​ గాంధీకి ఫోన్లు చేసి సీట్ల పంచాయతీ తేల్చేందుకు త్వరలోనే సమావేశం కావాల్సిందిగా కోరారు. మరోవైపు మహ కాంగ్రెస్​ సీట్ల విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. శివసేన విదర్భలో ఎక్కువసీట్లు చేస్తుంది. స్థానిక కాంగ్రెస్​ పార్టీ ముఖ్యులు ఇన్ని సీట్లు ఇచ్చేందుకు అనాసక్తి చూపుతున్నారు. ముంబై, మరఠ్వాడాలో కూడా ఎక్కువ సీట్లు కావాలని యూబీటీ, ఎన్సీపీలు డిమాండ్​ చేస్తుండడంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. 
 
అదే సమయంలో లోక్​ సభలో రామ్​ టెక్​, అమరావతి టిక్కెట్లను కేటాయించడం సహకరించడంతోనే కాంగ్రెస్​ గెలిచిందని అంటున్నారు. ఇప్పుడు మాత్రం సీట్లను వదులుకునే పరిస్థితి లేదని ఆశావహులు ఎక్కువగా ఉన్నారని వారికి సీట్లు కేటాయించకుంటే నష్టం తప్పదనే వాదనను కాంగ్రెస్​ రాష్ర్ట అధ్యక్షుడు నానా పటోలే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక మహారాష్ర్ట కాంగ్రెస్​ ను కాదని ఏకంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్ గాంధీతోనే మాట్లాడాలని కూటమి నేతలు నిర్ణయించారు. 
 
మరోవైపు సీట్ల పంపకాల్లో తేడాలు వస్తే మహారాష్​ర్టలో కాంగ్రెస బతికే పరిస్థితిలో లేదని నానాపటోలే చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ హిందూత్వం పేరుతో ప్రచార పర్వంలో దూసుకుపోతుందని, తాము మాత్రం ప్రచారంలో వెనుకబడ్డామని ఇప్పుడు సీట్ల పంచాయతీ ఒకటి తమను ఆందోళనలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ కూటమి నేతలకు తలొగ్గి సీట్లను కేటాయిస్తే కాంగ్రెస్​ కు నష్టం తప్పకపోవచ్చనే అభిప్రాయాన్ని నానా పటోలే వ్యక్తం చేశారు.