53కు చేరిన కల్తీ మద్యం మృతులు
The death toll from adulterated liquor has reached 53
పాట్నా: బిహార్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారంనాటికి 53కి పెరిగింది. సివాన్ లో 39మంది మృతి చెందగా, సరణ్–12, గోపాల్ గంజ్ లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇరవై మందికి పైగా అస్వస్థతకు గురికాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది కోలుకున్నారు. కల్తీ మద్యం ఘటనపై సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. కారకులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు ఆదేశించింది. కల్తీ మద్యం 16 గ్రామాల్లో విషాదం రేపింది. బిహార్ లో మద్య నిషేధం కొనసాగుతోంది. అయినా కల్తీ మద్యం మాఫియా పెద్ద యెత్తున కొనసాగుతుంది. గతంలో కూడా కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి.