విద్యార్థుల మృతిపై నివేదిక ఇవ్వండి

పోలీసులు, ఎంసీడీకి ఎన్​ హెచ్​ ఆర్​ సీ నోటీసులు

Jul 30, 2024 - 17:27
 0
విద్యార్థుల మృతిపై నివేదిక ఇవ్వండి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ముగ్గురు ఐఏఎస్​ విద్యార్థుల మృతిపై 14 రోజుల్లోగా సమగ్ర నివేదిక నీయాలని ఢిల్లీ పోలీసులు, మున్సిపల్​ కమిషనర్​ లకు జాతీయ మానవ హక్కుల కమిషన్​ (ఎన్ హెచ్​ ఆర్సీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న అన్ని కోచింగ్ సెంటర్లను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మరోవైపు ప్రమాదం జరిగిన మూడో రోజు కూడా సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులు, స్థానిక ప్రజలు రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఎదుట నిరసనలు కొనసాగించారు. పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు.