రహస్య ప్రదేశంలో నస్రుల్లా అంత్యక్రియలు పూర్తి
Nasrullah's last rites were completed in a secret place
టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన హిజ్బొల్లా చీఫ్ నస్రుల్లా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఏడు రోజుల తరువాత శుక్రవారం ఆయన అంత్యక్రియలను రహాస్య ప్రదేశంలో నిర్వహించారు. ఈయన అంత్యక్రియలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడవచ్చనే అనుమానంతో ఈ చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ టెహ్రాన్ గ్రాండ్ మసీదులో నస్రుల్లా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన గొప్పయోధుడని కొనియాడారు. నస్రుల్లా సేవలను ముస్లిం సమాజం ఎన్నటికీ మరువదన్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి ముందు ఖమేనిని రహస్య ప్రదేశానికి తరలించారు. ఆ తరువాత శుక్రవారమే ఆయన బహిరంగంగా ప్రసంగం చేస్తూ కనిపించారు.