ఇరాన్​ అధ్యక్షుడి మృతి

The death of the president of Iran

May 20, 2024 - 11:18
 0
ఇరాన్​ అధ్యక్షుడి మృతి

టెహ్రాన్​: ఇరాన్​ అధ్యక్షుడి గాలింపు ఎట్టకేలకు విషాదంగా ముగిసింది. ఇబ్రహీం రైసీ మృతిచెందినట్లుగా ఇరాన్​ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం అధ్యక్షుడు ఇబ్రహీం అజర్​ బైజాన్​ లోని ఓ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆయన హెలికాప్టర్​ ఆచూకీ గల్లంతైంది. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో రెండు హెలికాప్టర్లు మాత్రం సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతో అధికారుల్లో టెన్షన్​ మొదలైంది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ జాడ కోసం పెద్ద ఎత్తున సెర్చ్​ ఆపరేషన్​ కు దిగారు. వాతావరణం అనూకలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ క్రాష్​ ల్యాండింగ్​ అయినట్లు ఆయన క్షేమంగానే ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అనంతరం టెన్షన్​ పెరిగింది. కాగా రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్‌, అజర్‌ బైజాన్‌ గవర్నర్‌ మలేక్‌ రహ్‌మతీ, ఇతర ఉన్నతాధికారులు ఈ హెలికాప్టర్​ లో ప్రయాణిస్తున్నారు. వీరంతా మృతి చెందినట్లుగా ఇరాన్​ ప్రకటించింది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ, ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

ప్రధాని మోదీ సంతాపం..

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌-ఇరాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవడంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ఇరాన్‌కు భారత్‌ అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. 

ప్రమాదంపై అనుమానాలు..

కాగా అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదంలో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్రెయిన్​, ఇజ్రాయెల్ లాంటి దేశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.