ఐదో విడతలో..ప్రముఖుల ఓట్లు
In the fifth installment..celebrity votes

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐదో విడతలో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు సోమవారం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్మృతిఇరానీ..
అమేథీ గౌరీగంజ్ లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు వేశారు. భారత్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటు ద్వారానే అభివృద్ధి చెందిన భారత్ ను కలను సాకారం చేసుకోవచ్చని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
ఒమర్ అబ్దుల్లా..
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, బారాముల్లాలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజల గొంతుకను ప్రతీ ఒక్కరు తప్పక వినిపించాలన్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు అబ్దుల్లా విజ్ఞప్తి చేస్తున్నాను.
భారతీయులకు గర్వకారణం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్..
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం ప్రతీ ఒక్క భారతీయుడికి గర్వకారణమని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గవర్నర్ శక్తికాంతదాస్ ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రజాస్వామ్య తీర్పునీయడం అభినందనీయమన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసిన ఈసీ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ వీలైనంత త్వరగా ఓటు వేయాలని అభ్యర్థించారు.
నేను సరైన అభ్యర్థికి ఓటు వేశాను శోభా ఖోటే..
తాను సరైన అభ్యర్థికే ఓటు వేశానని సీనియర్ నటి శోభా ఖోటే అన్నారు. ఆమె ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తనను చూసి ప్రేరణతో ఓటింగ్ లో పాల్గొనాలని అన్నారు.
ఓటు అతిపెద్ద బాధ్యత రాజ్‌కుమార్‌రావు..
దేశ క్షేమానికి, ప్రజాస్వామ్య విజయానికి ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని ప్రతీఒక్కరికున్న అతిపెద్ద బాధ్యత ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవడమని సినీనటుడు రాజ్ కుమార్ రావు అన్నారు. ముంబైలో ఆయన సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రూడీ నా మామయ్య, నన్ను ఆశీర్వదిస్తారు: రోహిణి ఆచార్య..
మామయ్య ఆశీర్వాదం తనకు ముఖ్యమని ఆర్జేడీ అభ్యర్థి రోహిణి ఆచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. సరన్ లో సభ స్థానంలో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీపై పోటీకి దిగారు. ఆయన తనకు మామయ్య అని అన్నారు. తాను పోటీలో ఉండడం కూడా ఆయనకు గర్వకారణంగా భావిస్తున్నట్లు రోహిణి ఆచార్య అన్నారు.
నాన్న ఆశీస్సులు, ప్రజాశీర్వాదం ముఖ్యం చిరాగ్ పాశ్వాన్..
తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ కు ప్రజలు ఎలాంటి ఆదరణ, ప్రేమను చూపారో తనను కూడా అలాగే ఆదరిస్తారని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జపీ) ఎన్డీయే హాజీపూర్ ఎంపీ అభ్యర్థి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. హాజీపూర్ అభివృద్ధి కోసం తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని స్పష్టం చేశారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా అది ఇక్కడి ప్రజాశీర్వాదం వల్లేనన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కమల వికాసం ఖాయం దినేష్ ప్రతాప్ సింగ్..
రాయ్‌బరేలీ, అమేథీలలో కమలం వికసిస్తుందనడంలో సందేహం లేదని రాయ్‌బరేలీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ ఖాన్ అని, రాయ్‌బరేలీ నుంచి తొలి ఎంపీగా పనిచేసిన వ్యక్తి అని ఆయన అన్నారు. రాయ్‌బరేలీకి వచ్చిన తర్వాత రాహుల్ ఇప్పటి వరకు తన తాత పేరు ఎందుకు తీసుకోలేదని, ఫిరోజ్ ఖాన్ పేరు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. రాయ్ బరేలీలో ఆయన ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య విజయానికి ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని దినేష్ ప్రతాప్ సింగ్ అభ్యర్థించారు. ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉండడం విశేషం.
ఓటే ఆయుధం కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
సువిశాల భారత దేశంలో ఓటే ఆయుధమని దీని ద్వారానే దేశానికి మంచి చేసే వారిని ఎన్నుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధిలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉందని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి పీయూష్ ముంబై నార్త్ స్థానంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రతీ ఒక్కరి జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు.
గుడ్ గవర్నెన్స్‌కి ఓటు ఫర్హాన్ అక్తర్..
గుడ్ గవర్నెన్స్ కి తాను ఓటు వేశానని సినీనటుడు ఫర్హాన్ అక్తర్ అన్నారు. సోదరి జోయా అక్తర్ తో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధే అజెండా అక్షయ్ కుమార్..
భారత్ అభివృద్ధి చెందాలనేదే తన ఆశయం, కల అని ప్రముక సినీనటుడు అక్షయ్ కుమార్ అన్నారు. దేశం అభివృద్ధికి పాటుపడేవారికే తన ఓటు వేశానని తెలిపారు. ప్రతీ ఒక్కరూ దీన్నే ప్రామాణికతగా తీసుకుని ఓటు వేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తును మీడియాకు చూపారు. ఉత్సాహంగా, చురుకుగా ఉదయాన్నే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
రాజ్ నాథ్ సింగ్..
కుటుంబంతో కలిసి లక్నోలో సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనంతరం పోలింగ్ కేంద్రం బయటికి వచ్చి వేలికున్న సిరా చుక్కను చూపారు. మీడియాతో ఆయన ఏం మాట్లాడకుండానే వెనుదిరిగారు.
సింఎం ఏక్ నాథ్ షిండే..
ప్రతీ ఒక్కరూ ప్రజాస్వామ్య విజయానికి కృషి చేయాలని మహారాష్ర్ట సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆ దిశలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్పుడు మనం కలలు గన్న ప్రభుత్వాలు తమ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలనను అందించే అవకాశం ఉందని షిండే పేర్కొన్నారు. ముంబైలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.