సమరానికి సై నాలుగో విడత ఎన్నికలకు అంతా సిద్ధం

10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఎన్నికలు

May 12, 2024 - 15:17
 0
సమరానికి సై నాలుగో విడత ఎన్నికలకు అంతా సిద్ధం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాలుగో విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లను చేసింది. నాలుగో విడతలో మొత్తం 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు గాను ఎన్నికలను సోమవారం (మే 13)న నిర్వహించనున్నారు. నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ  కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లను చేసింది. 

ఇప్పటికే ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్​ ను విధించింది. భారీ ఎత్తున పారామిలటరీ, ఎన్నికల స్క్వాడ్​ ను రంగంలోకి దింపింది. 
ఇక ఎన్నికలు వేసేందుకు వచ్చే వృద్దులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. రాలేని వారి ఇంటివద్దకే వెళ్లి ఓటు వేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసింది. ఎండల దృష్ట్యా ఆయా పోలింగ్​ కేంద్రాలో మంచినీటి సౌకర్యం కల్పించింది. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. 

2019లో 96 సీట్లకు గాను అత్యధికంగా పశ్చిమ బెంగాల్​ లో 82.88 శాతం ఓటింగ్​ జరగగా, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్​ 14. 43 శాతం జరిగింది.

హాట్​ సీట్లు..

ఉత్తరప్రదేశ్​ నుంచి హాట్​ సీట్లుగా కన్నౌజ్​, ఉన్నావ్​ ఉన్నాయి. బిహార్​ నుంచి బెగుసరాయ్​, ముంగేర్​ స్థానాలు హాట్​ సీట్లుగా ఉన్నాయి. ఉత్తరాఖండ్​ నుంచి కుంతీ, పాలెము ఉన్నాయి. మధ్యప్రదేశ్​ నుంచి ఉజ్జయినీ, ధార్​ హాట్​ సీట్లుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్​ నుంచి బహరంపూర్​, కృష్ణానగర్​, అసన్​ సోల్​ లు హాట్​ సీట్లుగా ఉన్నాయి. మహారాష్ర్ట నుంచి బీడ్​ సీట్​ కాస్త హాట్​ సీట్​ లో స్థానం సంపాదించుకుంది. ఇక తెలంగాణలో హాట్​ సీట్లుగా అందరి దృష్టి హైదరాబాద్​ ఎంపీ స్థానంపై ఉంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్​ ఓవైసీ పోటీలో ఉండగా, బీజేపీ నుంచి మాధవీ లత పోటీలో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఎక్కువ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒడిశా నుంచి నబరంగ్​ పూర్​, కోరాపూట్​ లు హాట్​ సీట్​ లిస్టులో ఉన్నాయి.