బీజేపీలోకి వాయుసేన చీఫ్​ భదౌరియా

వాయుసేన మాజీ చీఫ్​ ఆర్కేఎస్​ భదౌరియా బీజేపీలో చేరారు.

Mar 24, 2024 - 16:23
 0
బీజేపీలోకి వాయుసేన చీఫ్​ భదౌరియా

నా తెలంగాణ, ఢిల్లీ: వాయుసేన మాజీ చీఫ్​ ఆర్కేఎస్​ భదౌరియా బీజేపీలో చేరారు. ఆదివారం కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్​ తావ్డేలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. భదౌరియా వాయుసేనలో 40యేళ్లు సేవలందించారు. ప్రధాని మోదీ ఆత్మనిర్బర్​ భారత్​కు సహకరించాలని పార్టీలోకి చేరినట్లు వెల్లడించారు. యూపీ నుంచి భదౌరియాను రంగంలోకి దింపేందుకు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ స్థానం నుంచి పోటీకి దింపుతారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.