పాక్ భక్తులకు కలగని బాలరాముని దర్శన భాగ్యం
పాస్ పోర్ట్ లో లోపం వల్లే అడ్డుకున్న ఐబీ
లక్నో: అయోధ్య బాలరాముని దర్శనం కోసం పాక్ సింధ్ నుంచి వచ్చిన 47 మందికి దర్శనభాగ్యం లభించలేదు. వారి వీసాలో తేడా ఉండడం వల్ల పోలీసులు వారిని అయోధ్య శ్రీరాముని దర్శనానికి వెళ్లనీయలేదు. కాగా ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా ఆదివారం వెలుగులోకొచ్చింది. వీరంతా భారత్ లోని పలు సందర్శనీయ స్థలాలను చూసేందుకు వచ్చారు. కాగా ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ పాస్ పోర్టులో వ్యత్యాసాలను గుర్తించింది. దీంతో వీరిని అయోధ్యకు అనుమతించలేదు. కాగ పాక్ నుంచి ఎంతో ఆశగా శ్రీరాముని దర్శనం కోసం వచ్చామని తమకు దర్శనభాగ్యం లభించకపోవడం అత్యంత దురదృష్టకరమని భక్తులు వాపోయారు. అయితే పాస్ పోర్టు వ్యత్యాసాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.