పూంచ్​ లో వరుస దాడులు ఉగ్రవాదులకు సహాయంలో స్థానికుల హస్తం?

30 నెలల్లో ఆరు ఉగ్ర ఘటనలు 21 మంది సైనికుల వీరమరణం

May 5, 2024 - 14:05
 0
పూంచ్​ లో వరుస దాడులు ఉగ్రవాదులకు సహాయంలో స్థానికుల హస్తం?

కశ్మీర్​ : గత 30 నెలల్లో పూంచ్​ లో ఆరు ఉగ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ఉగ్రదాడుల్లో 21 మంది సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు పూంచ్​ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్​ చేస్తున్నారనేది ఆర్మీ, పోలీసులకు కూడా అంతుపట్టకుండా ఉంది. అయితే ఇక్కడ ఉగ్రవాదులకు స్థానికుల సహాయ సహకారాలు అందుతున్నట్లు, వారికి సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా అనుమానాలున్నాయి. 

పూంచ్​ లో గత 30 నెలలుగా దాడులు వివరాలు..

2021 అక్టోబర్​ 11: చమ్రేడ్ ప్రాంతంలో సైనికులపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

2021 అక్టోబర్​ 21: పూంచ్​ భటాదుడియాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన దాడిలో ఆరుగురు సైనికులు వీరమరణం పొందారు. జమ్మూ-పూంచ్ హైవేని నెలన్నర పాటు మూసివేసి మరీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. 

2023 ఏప్రిల్​ 20: మరోమారు పూంచ్​ లోని ఇదే ప్రాంతం దభటాదుడియాలో సైనిక వాహనాన్ ఉగ్రవాదులు టార్గెట్​ చేశారు. గ్రెనేడ్ ల‌తో దాడికి పాల్పడ్డారు. ఆపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలోనూ ఐదుగురు సైనికులను వీరమరణం పొందారు. 

2023 డిసెంబర్​ 21: పూంచ్​ లోని డేరా సవానీ ప్రాంతంలో సైనిక వాహనాలపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

2024 జనవరి 12: పూంచ్​ లోని ధారాతి, కృష్ణ ఘాటిలో సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సైనికుల అప్రమత్తతో ముప్పు తప్పింది. 

2024 మే 4: పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో వైమానిక దళ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఒక సైనికుడు వీరమరణం పొందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఇందులో మరొకరు పరిస్థితి విషమంగా ఉంది.