అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నక్సల్స్​ రహిత చత్తీస్​ గఢ్​, భారత్​ కు కృషి

Apr 17, 2024 - 20:44
 0
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. చత్తీస్​ గఢ్​ లోని కాంకేర్​ లో జరిగిన ఎన్​ కౌంటర్​ పై బుధశారం అమిత్​ షా మీడియాతో చిట్​ చాట్​ లో మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నక్సలిజం, టెర్రరిజానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిరంతర ప్రచారం సాగిస్తూ వచ్చిందని, 2014 నుంచి 250 శిబిరాలను ఏర్పాటు చేస్తూ వచ్చామని చెప్పారు.125కు పైగా అరెస్టులు జరిగాయి. 150 మందికి పైగా నక్సలైట్లు లొంగిపాయారని అమిత్‌షా తెలిపారు. ప్రభుత్వ పాలసీ‌ కారణంగా చత్తీస్​ గఢ్​ లో మావోయిస్టుల పరిధి తగ్గిందన్నారు.  త్వరలోనే నక్సల్స్ రహిత చత్తీస్​ గఢ్​‌, భారత్​ ను షా ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత బస్తర్ ‌లోక్‌సభ స్థానంలో ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా, బస్తర్ ప్రాంతంలోని కాంకెర్ నియోజవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి జరిగిన ఎన్​ కౌంటర్​ లలో 80 మంది నక్సలైట్లు మృతిచెందారు. మంగళవారం జరిగిన భారీ ఎన్​ కౌంటర్​ లో 29 మావోలు మృతి చెందడం తెలిసిందే.