సీపెక్ పై భారత్ ఆందోళన చైనా–పాక్ లకు చురకలు
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్
సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి
, ఆక్రమిత కాశ్మీర్ గుండా ప్రాజెక్టుపై భారత్ అభిప్రాయం
ఈ ప్రాంతం తమ భూభాగమే
ఎస్ సీవో సమావేశంలో మంత్రి
ఇస్లామాబాద్: ఎస్ సీవో (షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్) దేశాలన్నీ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గుర్తించడం ముఖ్యమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ అన్నారు. బుధవారం ఉదయం ఎస్ సీవో దేశాలు ఇస్లామాబాద్ లో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా జై శంకర్ భారత్ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు.
సీపెక్ (చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) ఆక్రమిత కాశ్మీర్ గుండా చేపట్టడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ ప్రాంతం భారత్ భూభాగానికి చెందినదని పేర్కొంది. నిజమైన భాగస్వామ్యపక్ష ఎజెండాతో కొనసాగించలేరని పాక్–చైనాలకు చురకలంటించారు. ఈ ప్రాజెక్టు చేపట్టడం భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లవుతుంది.
పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా ఎస్‌సీవో దేశాల మధ్య సహకారం ఉండాల్సిన అవసరం ఉందని జై శంకర్ చెప్పారు. వాణిజ్యం, రవాణా, దేశ ప్రయోజనాల కోసం పనిచేసే ముందు ఇతర దేశాల ప్రయోజనాలు కూడా ముఖ్యమేనని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన సూచనల ద్వారా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా. అప్పుడే దేశాలు మరింతగా సహకారం అందించాయి. జై శంకర్ వివరించారు.
ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి..
ఉగ్రవాదం, వేర్పాటువాదంపై కలిసి పోరాడితేనే ఎస్ సీవో లక్ష్యాలను సాధించవచ్చని మంత్రి జై శంకర్ అన్నారు. ఈ పోరాటంలో పరస్పర నమ్మకం, నిజాయితీలు ఎంతో ముఖ్యమన్నారు. కరోనా, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ లాంటి ప్రపంచానికి కష్టమైన సమయంగా మంత్రి అభివర్ణించారు. వాణిజ్యం, వాతావరణం ఇలా అనేక సమస్యలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. చైనా ప్రధాని, మంగోలియా ప్రధానులతో మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. సమావేశానికి హాజరయ్యే ముందు పాక్ లోని భారత రాయబార కార్యాలయంలో జై శంకర్ అర్జున మొక్కను నాటారు.