ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
మాజీ మంత్రి జోగు రామన్న
నా తెలంగాణ, ఆదిలాబాద్: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ మానసిక ప్రశాంతతతో పాటు భక్తి ప్రవత్తులను పెంచుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటి కూడా హనుమాన్ దేవాలయం ముఖద్వారం ఏర్పాటు ఉత్సవాలతో పాటు తిరుమల నగర్ లో నూతనంగా నిర్మించిన దక్షిణామూర్తి హనుమాన్ ఆలయం గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్నను శాలువాతో సత్కరించారు. బీఆర్ ఎస్ హయాంలో ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించామన్నారు. యజ్ఞ యాగాదులను నిర్వహించి రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ స్వామి, గణేష్, దేవదాస్, భోజ రెడ్డి, రవి, అశోక్, రవీందర్ రెడ్డి, ఆనంద రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.