ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
నా తెలంగాణ, ఆదిలాబాద్: పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అభినందనీయమని తెలంగాణ రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో బోధన, హస్టల్ లోని అందుతున్న సౌకర్యాలు, వసతులపై అడిగి తెలుసుకున్నారు. గదులు, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. ఏదైనా సమస్య ఉంటే కమిషన్ దృష్టికి ఎలా తీసుకురావాలన్నదానిపై అవగాహన కల్పించారు. సమస్యలపై ఫిర్యాదు చేయడం కోసం మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9490555533ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ సభ్యురాలు ఈశ్వరి భాయి, సిబ్బంది పాల్గొన్నారు.