ఏసీబికి వలలో ఎస్ఐ
ACB Arrest Si
నా తెలంగాణ, నాగర్ కర్నూల్: జిలెటిన్ స్టిక్స్ కేసులో చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ. 50 వేలు ముట్టజెప్పాల్సిందేనని వెల్దండ ఎస్ ఐ రవి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ రూ. 50 లంచం తీసుకుంటుండగా ఎస్ సహాయకుడు అంబులెన్స్ డ్రైవర్ ను, ఇటు పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. కల్వకుర్తి వెల్దండ మండలంలోని తిలక్ నగర్ కు చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎస్ ఐ రవి సోదాలు చేపట్టాడు. ఈ సోదాల్లో జిలెటిన్ స్టిక్స్ లు లభించాయి. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం డిమాండ్ చేశాడు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.