ఉప ఎన్నికలు వాయిదా వేయాలి

సుప్రీంలో జేఎస్పీ ప్రశాంత్​ కిషోర్​ పిటిషన్​

Nov 9, 2024 - 18:44
 0
ఉప ఎన్నికలు వాయిదా వేయాలి

పాట్నా: బిహార్​ లో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని జన్​ సూరజ్​ పార్టీ అధినేత ప్రశాంత్​ కిషోర్​ సుప్రీంలో శనివారం పిటిషన్​ దాఖలు చేశారు. ఛత్​ పూజ ఉత్సవాలు జరుగుతున్నాయని కూడా వివరించామని పిటిషన్​ లో పేర్కొన్నారు. 13న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరామన్నారు. 20కి తేదీని మార్చాలని విన్నవించామన్నారు. కాగా ప్రశాంత్​ కిషోర్​ వేసిన పిటిషన్​ 11న సోమవారం విచారణకు రానుంది. యూపీ, పంజాబ్​, కేరళ వంటి ప్రాంతాల్లో ఎన్నికల తేదీలను మార్చారని కూడా పిటిషన్​ లో పేర్కొన్నారు. తమ అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. బిహార్​ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాల నుంచి జన్​ సూరజ్​ పార్టీ కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఉప ఎన్నికలలో అన్ని పార్టీలకు చెందిన 38 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 50 నామినేషన్లు దాఖలయ్యాయి.