ఎఎంయూలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించరా?
సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: కేంద్ర నిధులతో నడిచే ఎఎంయూ యూనివర్సిటీలో ముస్లింలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, దళితులు, వెనుకబడిన వర్గాలు, ఇతరులకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. శనివారం అలీఘర్ లోని ఖైర్ స్థానంలో నిర్వహించనున్న ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పూర్తిగా మరిచిపోయిన రాజ మహేంద్ర ప్రతాప్ పేరు మీద అలీఘర్ స్టేట్ యూనివర్సిటీ ఇచ్చామన్నారు. ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం ఉన్నా ఎంఎంయూలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం అందరి శ్రేయస్సు కోసమే నిధులను కేటాయిస్తుంటే అణగారిన వర్గాల పిల్లలు ఎందుకు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందలేరన్నారు. రానున్న కాలంలో అందరికి ఉపయోగపడేలా అద్భుతమైన యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు.