మెజార్జీ స్థానాలు సాధించాం 380లో 270 పక్కా

లక్ష్యాన్ని 4‌00 చేరుకుంటాం పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తారా? మతువా కమ్యూనిటీకి ఇబ్బందులుండవు సీఎం మమత పాలన అంతా అవినీతి మయం బెంగాల్ ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్​ షా

May 14, 2024 - 16:59
 0
మెజార్జీ స్థానాలు సాధించాం 380లో 270 పక్కా

కోల్​ కతా: 380 స్థానాలకు జరిగిన నాలుగు దశ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ 270 స్థానాల పూర్తి మెజార్టీని సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్​ లోని బంగావ్​ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సంపూర్ణ మెజార్టీ దాటిపోయామని, లక్ష్యాన్ని 400 దాటాల్సి ఉందని అమిత్​ సా పేర్కొన్నారు. 

సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తామని సీఎం మమత చెప్పడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. మతువా కమ్యూనిటీ ప్రజలకు తమ ప్రభుత్వం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని షా భరోసానిచ్చారు. ఈ విషయంలో సీఎం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజలు గుర్తెరగాలని న్నారు. 

బెంగాల్​ లో అవినీతి, చొరబాట్లు, బాంబు పేలుళ్లు, సిండికేట్​ పాలన మమతదన్నారు. ఈమెను ఆపే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్నారు. శారదా చిట్​ ఫండ్​, ఉపాధ్యాయ నియామకాలు, మున్సిపల్​ నియామకాలు, రేషన్​, గోవులు, బొగ్గు ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ సీఎం మమత, ఆమె పార్టీ నేతల ద్వారా బెంగాల్​ ప్రజల కష్టార్జితాన్ని దోచుకుతింటున్నారని మంత్రి అమిత్​ షా మండిపడ్డారు.