సంభాల్​ పై చర్యలొద్దు

పిటిషనర్​ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు: సుప్రీం సీజేఐ

Nov 29, 2024 - 13:50
 0
సంభాల్​ పై చర్యలొద్దు

ప్రభుత్వం శాంతి కమిటీని ఏర్పాటు చేయాలి
సర్వే నివేదిక సీల్​ చేయాలి
పిటిషన్​ ను మూడు రోజుల్లోగా విచారించాలి
అలహాబాద్​ హైకోర్టుకు సుప్రీం సూచన
భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా
ఇంటర్నెట్​ నిలిపివేత.. శాంతికి భంగం కలిగించొద్దన్న డీఐజీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సంభాల్​ మసీదు వివాదంపై యూపీ దిగువ కోర్టు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం సంభాల్​ మసీదు పిటిషన్​ పై విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలు లేకుండా దిగువ కోర్టు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అదే సమయంలో ముందుగా హైకోర్టులో పిటిషన్​ ఎందుకు దాఖలు చేయలేదని పిటిషనర్​ ను ప్రశ్నించింది. ఇరుపక్షాలతో జిల్లా యంత్రాంగం శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. అంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తెలిపింది. అదే సమయంలో హైకోర్టు ముస్లిం పర్సనల్​ బోర్డు పిటిషన్​ ను స్వీకరించి విచారణ చేపట్టాలని సీజేఐ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పది ఇలాంటి కేసులో పెండింగ్​ లో ఉన్నాయని పిటిషనర్​ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందులో ఐదు యూపీలోనే ఉన్నాయన్నారు. ముందుగా కేసు వేసి తరువాత కథలు అల్లుతున్నారని ఆరోపించారు. 
సంభాల్​ లో భారీ భద్రత..

సుప్రీంకోర్టు ఆదేశం ఆరు సూచనలు..

1.- మసీదు సర్వే నివేదిక సీల్​ చేయాలి. ఎవ్వరికీ అందించవద్దు.
2. కేసులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రస్తుతం చూడడం లేదని సీజేఐ చెప్పారు. ఉత్తర్వులను సవాలు చేసే హక్కు పిటిషనర్లకు ఉందన్నారు. 
3.- ప్రస్తుతం శాంతి నెలకొనాలి. ఈ పిటిషన్​ ను పెండింగ్​ లో పెడతాం. ఈ కేసు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు, నిర్ణయాలు తీసుకోబడవని సీజేఐ తెలిపారు. 
4.- హైకోర్టు అనుమతి లేకుండా కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దు. ట్రయల్ కోర్టు జనవరి 8 వరకు ఎలాంటి తీర్పు ఇవ్వొద్దు.
5.- ముస్లిం పక్షం పిటిషన్‌ను దాఖలు చేసిన వెంటనే మూడు రోజుల్లోగా విచారించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించారు. 
6.- సంభాల్‌లో శాంతి భద్రతలను కాపాడాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. రెండు వర్గాలతో కూడిన శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

సంభాల్​ లో భారీ భద్రత..

మొరాదాబాద్ రేంజ్ డీఐజీ మునిరాజ్ మాట్లాడుతూ - శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పీఎసీ, ఆర్​ ఎఎఫ్​ భద్రతా దళాలను మోహరించామన్నారు. అదే సమయంలో డ్రోన్ల ద్వారా నిఘాను పెంచామన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడడమే తమ విధి అని తెలిపారు. సంభాల్​ లో 144 సెక్షన్​ కొనసాగుతుందని ఎవ్వరూ ఈ ప్రాంత శాంతికి భంగం వాటిల్లే చర్యలకు పాల్పడవద్దన్నారు. ఇంటర్నెట్​ పై నిషేధం ఉంటుందన్నారు.