బీజేపీ నేత అనంత్ తో సీఎం మమత భేటీ
CM Mamata met with BJP leader Ananth
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీతో ఎప్పుడు ఎడమోహం, పెడమోహంగా ఉన్న టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ మంగళవారం బీజేపీ ఎంపీ అనంత్ మహరాజ్ తో భేటీ అయ్యింది. కాగా సీఎంను అనంత్ మహరాజ్ ఘనంగా స్వాగతించారు. అనంతరం అరగంటపాటు ఇరువురి భేటీ కొనసాగింది. అనంత్ నివాసానికి చేరుకోవడానికి ముందు మమతా బెనర్జీ మదన్ మోహన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రైలు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అనంత్ గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉత్తర బెంగాల్ కూచ్ బెహార్ ను ప్రత్యేక గ్రేటర్ రాష్ర్టంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితమే అతన్ని బీజేపీ రాజ్యసభకు పంపింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ టికెట్ పై రాజ్యసభకు వెళ్లిన తొలినాయకుడు కూడా అనంత్ కావడం గమనార్హం. అయితే వీరిరువురి మధ్య ఏం చర్చలు జరిగాయన్న విషయం తెలియరాలేదు.