వాడెట్టి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం కర్కరే కసబ్​ తుటాతో చనిపోలేదన్న కాంగ్రెస్​ నేత

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మండిపాటు

May 5, 2024 - 14:55
 0
వాడెట్టి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం కర్కరే కసబ్​ తుటాతో చనిపోలేదన్న కాంగ్రెస్​ నేత

ముంబై: కాంగ్రెస్​ నాయకుడు విజయ్​ వాడెట్టివార్ వ్యాఖ్యలపై ​బీజేపీ విరుచుకుపడింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'కాంగ్రెస్ తన ప్రత్యేక ఓటు బ్యాంకును భద్రపరుచుకునేందుకు ఎంత నీచానికైనా దిగజారుతుందనడానికి ఈయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 26/11 ఉగ్రవాదులకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ ఈ విషయాన్ని నిరూపించారని మండిపడ్డారు. ఈయన చెప్పిన దాని ప్రకారం మరీ కసబ్​ దోషి కాదా? అమరవీరుడా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చేందుకు వాడెట్టివార్​ కు సిగ్గులేదా? అని వినోద్​ తావ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వాడెట్టివార్​ వ్యాఖ్యలు?

26/11 ముంబై దాడుల్లో హేమంత్​ కర్కరే కసబ్​ తూటాకు బలికాలేదని పోలీసులు పేల్చిన బుల్లెట్లతోనే చనిపోయాడని కాంగ్రెస్​ నాయకుడు విజయ్​ వాడెట్టివార్​ వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఉజ్వల్​ నిగమ్ (కసబ్​ కేసు న్యాయవాది) ద్రోహి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.