మహాదేవుడి తొలి రూపం సాక్షాత్కారం ఎనిమిది అడుగులతో మంచులింగ దర్శనం

అమర్​ నాథ్​ గుహలోని మంచుతో కూడిన శివలింగం (మహాదేవుడు) తొలి రూపం ఆదివారం దర్శనమిచ్చింది. మంచు శివలింగం దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు ఉంది.

May 5, 2024 - 15:17
 0
మహాదేవుడి తొలి రూపం సాక్షాత్కారం ఎనిమిది అడుగులతో మంచులింగ దర్శనం

కాశ్మీర్​ : అమర్​ నాథ్​ గుహలోని మంచుతో కూడిన శివలింగం (మహాదేవుడు) తొలి రూపం ఆదివారం దర్శనమిచ్చింది. మంచు శివలింగం దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు ఉంది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో దర్శనమిస్తోంది. అమర్​ నాథ్​ యాత్రకు ఏప్రిల్​ 15 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూన్​ 29 నుంచి ఆగస్టు రక్షా బంధన్​ వరకు ఈ యాత్ర చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మొత్తం 52 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. యాత్రకు 13 నుంచి 70 సంవత్సరాల యాత్రికులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే యాత్ర చేపట్టేవారు ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్​ చెకప్​ రిపోర్టును తప్పక సమర్పించాల్సి ఉంటుంది. గతేడాది 4.5 లక్షల మంది భక్తులు యాత్ర చేపట్టారు. ఈసారి మాత్రం ఆరు లక్షలపైనే భక్తులు యాత్రను చేపట్టనున్నారు. అయితే గతంలో 3 నుంచి 4 అడుగులు మాత్రమే పలుచోట్ల రోడ్డు ఉండేది. వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు పలుచోట్ల కేంద్ర ప్రభుత్వం 14 అడుగుల మేర దారిని విస్తరించింది. దీంతో ఇరుకుదారులు కాస్త విశాలంగా మారాయి.