రాంపూర్​ ఎస్పీ నేత నాలుగు పెళ్లిళ్లు!

మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి నిజాలు

May 3, 2024 - 19:14
 0
రాంపూర్​ ఎస్పీ నేత నాలుగు పెళ్లిళ్లు!

లక్నో: సమాజ్​ వాదీపార్టీ రాంపూర్​ అభ్యర్థి మొహిబ్బుల్లా నాలుగో వివాహం చేసుకొని మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.  పెళ్లి అనంతరం తనను ఇంటినుంచి వెళ్లగొట్టాడని ఆగ్రా డీసీపీకి ఆ మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసింది. మొహిబ్బుల్లా ఎన్నికల అఫిడవిట్​ లో తన భార్య పేరును సామ్ర నాజ్​ గా ఆయన ప్రస్తావించి చిక్కుల్లో చిక్కుకున్నట్లయింది. 

కేసును ఫ్యామిలీ కౌన్సిలింగ్​ సెంటర్​ కు పంపినట్లు ఆగ్రా డీసీపీ తెలిపారు. షాహీద్​ నగర్​ కు చెందిన రుమానా పర్వీన్​ ఫిర్యాదు చేశారు. 

అత్తామామలు అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొహిబ్బుల్లా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని సమాచారం. మొదటి భార్య ఆపియా ఖాతూన్​, రెండో భార్య రాయ్​ బరేలీకి చెందినవారు, మూడో భార్య నజీఫాను ఈయన పెళ్లి చేసుకోవడం విశేషం. 
అయితే ఫిర్యాదు సందర్భంగా తనను చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించడం గమనార్హం.

కాగా ఆయా విషయాలపై ఫ్యామిలీ కౌన్సిలింగ్​ సెంటర్​ ఇన్​ చార్జీ ఏసీపీ పూనమ్​ సిరోహి దరఖాస్తుపై విచారణకు ఆదేశించారు.