ఎస్బీఐ సేవలు ప్రశంసనీయం

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​

Nov 18, 2024 - 18:07
 0
ఎస్బీఐ సేవలు ప్రశంసనీయం

ముంబాయి: డిజిటల్​ లావాదేవీల నిర్వహణలో ఎస్​ బీఐ చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. సోమవారం ముంబాయిలోని ఎస్బీఐ మెయిన్​ బ్రాంచ్​ బిల్డింగ్​ శతాబ్ధి ఉత్సవాల్లో మంత్రి నిర్మలా సీతారామన్​ పాల్గొని ప్రసంగించారు. 1920లో 250 శాఖలుగా ఉన్న ఎస్బీఐ ప్రస్తుతం దేశాభివృద్ధికి కీలకంగా మారి 22,500 బ్రాంచ్​ లను, 65వేల ఏటీఎంలను, 85వేల కరస్పాండెంట్​ లను 50 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉందని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్​ ఎస్పీఐ అని మంత్రి అభినందించారు. ఈ బ్యాంకు ద్వారా రోజుకు 20 కోట్ల డిజిటల్​ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామన్​ ఎస్బీఐ స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఆడియో బుక్​ ను ఆవిష్కరించారు.