51వ రాష్ట్రం ప్రతిపాదనకు అంగీకరించాలి

The 51st state must agree to the proposal

Dec 10, 2024 - 18:38
 0
51వ రాష్ట్రం ప్రతిపాదనకు అంగీకరించాలి

నవ్వుతూనే ట్రంప్​ ప్రతిపాదన
ప్రతిపాదనపై నోరెళ్లబెట్టిన జస్టిన్​ ట్రూడో
సుంకం తగ్గించాలన్న ప్రతిపాదనపై మెలిక
చొరబాట్లు, మాదకద్రవ్యాలను అడ్డుకోవాల్సిందే

వాషింగ్టన్ డీసీ: కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే ప్రతిపాదనకు ఒకే చెప్పాలని అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​  అన్నారు. అమెరికా కెనడా  ఉత్పత్తులపై విధించిన 25 సుంకంపై చర్చించేందుకు ట్రంప్​, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడోతో భేటీ అయ్యారు. మంగళవారం జరిగిన వీరి భేటీలో ట్రంప్​ ట్రూడోకు పలు కీలక సూచనలు చేశారు. . కెనడా ఒక గొప్పదేశంగా ట్రంప్​ అభివర్ణించారు. సరిహద్దు సమస్యలు, వాణిజ్య లోటు వంటి విషయాలతోపాటు ముఖ్యంగా అమెరికా విధిస్తున్న 25 శాతం సుంకం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ట్రూడో ట్రంప్​ కు విజ్ఞప్తి చేశారు. దీంతో కెనడా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని ఆవేదన వెళ్లగక్కారు. సరిహద్దు ద్వారా అక్రమ చొరబాట్లను నిరోధించడంలో, మాదక ద్రవ్యాలను అమెరికాలోకి వస్తుంటే అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతున్న అంశాన్ని ట్రంప్​ లేవనెత్తారు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే సుంకం తగ్గించే ప్రతిపాదనకు అంగీకరించబోమన్నారు. సమావేశం ఆఖరులో కెనడా అమెరికా 51వ రాష్ట్రంగా అవతరించాలని గొంతెమ్మ కోరికను వినిపించడంతో ఇటు ట్రూడోకు, ఆయన వెంట ఉన్న అధికార యంత్రాంగానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. ట్రంప్​ ట్రూడోతో నవ్వుతూనే ఈ ప్రతిపాదన చేసినా గతంలోనూ పలుమార్లు ఇదే అంశాన్ని లీకుల ద్వారా లేవనెత్తి ప్రస్తుతం సూటిగానే అడిగేయడంతో ట్రూడోకు ఏం చెప్పాలో తెలియక ఆయన నవ్వులో నవ్వును కలుపుతూ నీళ్లు నమిలారు.