బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు

సచివాలయ సెక్రెటరీ, పోలీసు కమిషనర్లకు ఢిల్లీ ఎల్జీ లేఖ

Dec 10, 2024 - 18:16
 0
బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో ఉంటున్న అక్రమ బంగ్లాదేశీయులపై వెంటనే చర్యలు ప్రారంభించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎల్​జీ సచివాలయ చీఫ్​ సెక్రెటరీ, పోలీసు కమిషనర్​ లకు మంగళవారం లేఖ రాశారు. అక్రమ చొరబాట్లపై మెతకవైఖరి అవలంభించొద్దన్నారు. రెండు నెలలపాటు ప్రత్యేక ప్రచారం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోకా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దర్గాలోని ప్రముఖ ఉలేమాలు హజ్రత్ నిజాముద్దీన్, బస్తీ హజ్రత్ నిజాముద్దీన్ సహా నగరంలోని ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్‌లో హిందూ, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలోని అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జీని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులకు ఇళ్లు అద్దెకు ఇవ్వవద్దని ఉలేమాలు డిమాండ్​ చేశారు. ఏ సంస్థలోనూ ఉపాధి కల్పించకూడదన్నారు.