రాష్ట్రమాతగా గోవు

మహారాష్ట్ర సర్కార్​ ఉత్తర్వులు జారీ దేశంలోనే ఆవును రాష్ర్ట తల్లిగా ప్రకటించిన తొలి ప్రభుత్వంగా రికార్డు

Sep 30, 2024 - 13:58
 0
రాష్ట్రమాతగా గోవు

ముంబాయి: దేశంలోనే తొలిసారి ఆవును రాష్ర్ట మాత (తల్లి)గా ప్రకటిస్తూ మహారాష్ర్ట ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వేదకాలం నుంచి భారతీయ సంస్కృతిలో గోవుకు అత్యధిక ప్రాధాన్యత ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో ప్రకటించారు. ఆవుపాలు, ఆయుర్వేద వైద్య విధానం, పంచగవ్య చికిత్సా విధానం, గోమూత్రం, సేంద్రియ వ్యవసాయం వంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇకనుంచి ఆవును రాష్​ర్టమాతగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఆవుపాల వల్ల వ్యక్తులు, పిల్లల్లో శారీరక అభివృద్ధి మెరుగుపడుతుందని, ప్రశాంత స్వభావం చేకూరుతుందని మహారాష్​ర్ట ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. 

దేశంలో వరుస గోహత్యల నేపథ్యంలో గోవుకు రక్షణ చేకూర్చాలని డిమాండ్​ లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ర్ట ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి ఒక అడుగు ముందుకేసి గోవును రాష్​ర్టమాతగా ప్రకటించింది.