యూఎన్ వేదికపై రవిశంకర్ ప్రారంభోపన్యాసం
Ravi Shankar's inaugural speech at the UN
ప్రధాని మోదీ చొరవతో అరుదైన అవకాశం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: స్వామి వివేకానంద చికాగో ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం మరోమారు ప్రధానమంత్రి మోదీ చొరవతో ఈ అవకాశం ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ కు దక్కనుందా? అంటే అవుననే అనిపిస్తుంది. డిసెంబర్21 శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో ప్రధాన ప్రసంగానికి రవిశంకర్ ను ఎంపిక చేశారు. యుగయుగాలుగా భారత్ తమ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతుంది. ఋషులు, మునులు, సాధు, సంతువులు తమ ప్రసంగాలు, ఆచరణాత్మక అంశాలు, ప్రేమ, దయ, జాలి అనే గుణగణాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మోదీ చొరవతో యూఎన్ అధికారులు రవిశంకర్ ను ధ్యాన ప్రారంభోపన్యాసానికి ఎన్నుకున్నారు.
131 సంవత్సరాల క్రితం అమెరికా చికాగో వేదికగా స్వామి వివేకానంద ప్రసంగం ధరిత్రి ఉన్నంత వరకూ చరిత్రలో నిలిచిపోతుందని తెలిసిందే. అంత శక్తివంతమైన ప్రసంగం స్వామి వివేకానందది. ప్రపంచదేశాలను ఆయన ప్రసంగం చెరగని ముద్ర వేసింది. చరిత్ర పూటల్లో చిరస్థాయిగా నిలిచింది. రవిశంకర్ ఎంపికతో ప్రపంచం దృష్టి మరోమారు భారత్ ఆయన ఉపన్యాసంపై పడింది. యూఎన్ రవిశంకర్ ప్రారంభోపన్యాసంపై అనేక తర్జనభర్జనల అనంతరం ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రపంచవేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ విధానంకూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. విపత్తులు, సంక్షోభాల సమయంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాలు కూడా ఇందుకు కారణభూతంగా నిలిచాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా మరోమారు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రారంభోపన్యాసం చేసే అవకాశం దక్కించుకోవడం హర్షించదగినది.