చాయ్ పే చర్చలో థార్ ఎంపీ సావిత్రి ఠాకూర్
మోదీ కేబినెట్ లో అవకాశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చాయ్ పే చర్చలో ఆదివారం రాజస్థాన్ థార్ ఎంపీ సావిత్రి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. 2024 ఎంపీ ఎన్నికల్లో సావిత్రి ఠాకూర్ కాంగ్రెస్ కు చెందిన రాధేశ్యామ్ మువెల్‌ను 2 లక్షల 18 వేల 665 ఓట్ల తేడాతో ఓడించారు. సావిత్రి ఠాకూర్‌కు 7 లక్షల 94 వేల 449 ఓట్లు రాగా, రాధేశ్యామ్ మువెల్‌కు 5 లక్షల 75 వేల 784 ఓట్లు వచ్చాయి. 2014లో కూడా సావిత్రి ఠాకూర్ ధార్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సావిత్రి తనదైన ముద్ర వేశారు. అంతకుముందు ఆమె సామాజిక కార్యకర్తగా పనిచేశారు. కాగా సావిత్రి ఠాకూర్ కూడా మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గంలో ప్రాధాన్యత దక్కినట్లు సమాచారం. ఆమెకు ఏ శాఖ ఇవ్వనున్నారనేది తెలియాల్సి ఉంది.