ఉగ్ర నిర్మూలపై ఉన్నతాధికారులతో షా భేటీ

బ్లూ ప్రింట్​ ట్రయల్స్​ అమలుపైనే చర్చలు? సరిహద్దుల్లో భారీగా భద్రతా దళాల మోహరింపు పాక్​,  చైనాలకు ముచ్చెమటలు

Jun 15, 2024 - 17:59
 0
ఉగ్ర నిర్మూలపై ఉన్నతాధికారులతో షా భేటీ

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో ఉగ్రదాడి ఘటనలపై మరోమారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నతస్థాయి భేటీ జరపనున్నారు. ఎన్​ఎస్​ఏ చీఫ్​ అజిత్​ ధోవల్​, జమ్మూ కాశ్మీర్​ లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, ఆర్మీ, సీఆర్పీఎఫ్​ ఉన్నతాధికారులతో సమావేశంలో నిర్వహించారు. ఉగ్రవాద పూర్తి నిర్మూలనకు చర్యలను చేపట్టనున్నారు. మరోవైపు కేంద్రం, హోంశాఖ నేతృత్వంలోని రూపొందించిన బ్లూ ప్రింట్​ ట్రయల్స్​ కూడా కొనసాగుతున్నాయి. అయితే శనివారం భారీ ఎత్తున భద్రతా బలగాలు పాక్​,చైనా సరిహద్దుల్లో మోహరించడంతో ఇరుదేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసలు భారత్​ రూపొందించిన బ్లూ ప్రింట్​  విధానం ఏంటనేది బయటికి రావడం లేదు. ట్రయల్​ లోనే ఈ రెండు దేశాలకు ముచ్చెమటలు పడుతుంటే.. ఇక పూర్తి అమల్లోకి వస్తే ఇరుదేశాలతోపాటు, ఉగ్రవాదుల ఆటను భారత్​ పూర్తిగా కట్టడి చేయగలుగుతుంది.