జాదవ్​ పూర్​ లో ఉద్రిక్తత

బాంబుదాడులకు తెగబడ్డ టీఎంసీ? చెరువులో ఈవీఎంలు, వీవీప్యాట్​ లు!

Jun 1, 2024 - 10:53
 0
జాదవ్​ పూర్​ లో ఉద్రిక్తత

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ లోని జాదవ్​ పూర్​ భాంగర్​ సతులియా ప్రాంతంలో ఐఎస్​ఎఫ్​, సీపీఎం,టీఎంసీ కార్యకర్తలు ఒకరినొకరు దాడులు చేసుకున్నారు. టీఎంసీ కార్యకర్తలు బాంబుదాడులకు పాల్పడ్డారనే నేపథ్యంలో ఈ మూడు పార్టీలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దాడి సందర్భంగా పలువురు మహిళలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే కల్పించుకున్న పోలీసులు పోలింగ్​ బూత్​ వద్ద గూమికూడి ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న వారిపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అదనపు బలగాల రాకతో ప్రశాంతంగా పోలింగ్​ నిర్వహిస్తున్నారు.

దక్షిణ 24 పరగణాస్‌లోని కుల్తాయ్‌లోని బూత్ నంబర్ 40, 41 వద్ద జనసమూహం ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను నీటిలో విసిరేశారు. టీఎంసి మద్దతుదారులు ఓటర్లను బెదిరించి ఈవీఎంలు, వీవీ ప్యాట్​ లను నీటిలో పడవేశారని ఆరోపించారు.