అంబేద్కర్​ ను ఓడించేందుకు ప్రయత్నాలు

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

Dec 14, 2024 - 17:43
 0
అంబేద్కర్​ ను ఓడించేందుకు ప్రయత్నాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బాబా సాహెబ్​ అంబేద్కర్​ ని ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్​, కమ్యూనిస్టులు ఒక్కసారి కాదు, రెండు సార్లు ప్రయత్నించారని, కలిసి పనిచేశారని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పలువురు విపక్ష ఎంపీలు ప్రధాని, బీజేపీ ప్రభుత్వంపై దాడికి దిగారు. దీనిపై సూర్య ఎదురుదాడికి దిగారు. నెహ్రూ సూచనల మేరకు అంబేద్కర్​ ను ఓడించేందుకు ఎస్​.ఎ.డాంగే ప్రయత్నించారని విమర్శించారు. ఈ విషయాన్ని సావిత్రి అంబేద్కర్​ తన పుస్తకంలో రాశారని అన్నారు. తేజస్వి సూర్య కాంగ్రెస్‌పై దాడి చేశారు. ఈ రెండు పార్టీలు అంబేద్కర్​ ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆర్​ ఎస్​ ఎస్​ నాయకుడు దత్తోపంత్ తెంగడి ఆయన విజయానికి సహకరించారన్నారు. కాంగ్రెస్​, కమ్యూనిస్టు నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని తేజస్వీ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.