ఈ–కామర్స్ పై అధ్యయనం అవసరం
పై ఫస్ట్ ఇండియా ఫౌండేషన్ నివేదిక విడుదల కేంద్రమంత్రి పీయూష్ గోయల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈ కామర్స్ ప్రభావంపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం అవసరమని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో వంద మిలియన్ ల వ్యాపారులకు ఈ వ్యాపారం ద్వారా అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కామర్స్ ను అభివృద్ధికి పౌర కేంద్రంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
బుధవారం న్యూ ఢిలీలో ఈ కామర్స్ నికర ప్రభావంపై ‘పై ఫస్ట్ ఇండియా ఫౌండేషన్’ నివేదికను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. అనంతరం ప్రసంగించారు.
దేశ అవసరాల దృష్ట్యా ఈ కామర్స్ అత్యంత ప్రభావం చూపుతోందన్నారు. అదే సమయంలో ఈ రంగంలో అభివృద్ధికి సమతుల్య విధానం అవసరమని సూచించారు. వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు సానుకూల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాపారులకు సూచించారు.
ఇదే సమయంలో చిన్న వ్యాపారస్థులకు నష్టం వాటళ్లకుండా వారి వృద్ధిని కూడా నిర్ధారించే సమతుల్య విధానం అవసరమని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.