ఋణమాఫీపై బీజేపీ నిరాహార దీక్ష

BJP on hunger strike over loan waiver

Aug 24, 2024 - 17:22
 0
ఋణమాఫీపై బీజేపీ నిరాహార దీక్ష
అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి
రెబ్బెన సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దు చేయాలి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్
నా తెలంగాణ, ఆదిలాబాద్​: అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రూపాయల ఋణమాఫీ చేయడంతో పాటు రైతు సహకార సంఘంలో ఆవినీతికి పాల్పడిన అధికారులు పాలకవర్గంపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. 
 
పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రైతు వేదిక కార్యాలయం ఎదుట నిరాహార దీక్షా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి రైతులకు రూ.రెండు లక్షల ఋణమాపీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రిల పేరుతో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే ఋణమాఫీ చేశారని ఆరోపించారు. 70 శాతం రైతులకు ఋణమాఫీ కాలేదన్నారు. 
 
రెబ్బైన సహకార రైతు వేదిక ఎదుట నిరాహార దీక్షలో బీజేపీ నాయకులు..
 
సంఘంలో పాలకవర్గ సభ్యులు ఆవినీతికి పాల్పడ్డారని, రైతులకు తెలియకుండానే వారి పేరు మీద అప్పులు, చనిపోయిన రైతులను పేరుమీద లోను రెన్యువల్ చేసి రైతు ఋణమాఫీలను కాజేశారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బీజేపీ తరపున ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సాల్లు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు గుల్పం చక్రపాణి, జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నవీస్ గౌడ్, జగన్నాథ ఓదెలు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, మండల అధ్యక్షులు డోంగిరి నందకిషోర్, గోలేటి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేష్, ఉపాధ్యక్షులు జటంగుల శ్రీశైలం, పోతురాజుల నారాయణ, బ్రహ్మయ్య పాల్గొన్నారు.