హస్తానికి ధరణి గుడ్​ బై

కమల తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే విజయ. ప్రధాని లాంటి నేత అవసరం. అభివృద్ధికి అన్నామలై సహకారంతో ముందుకు..

Feb 24, 2024 - 17:21
 0
హస్తానికి ధరణి గుడ్​ బై
చెన్నై: తమిళనాడులో హస్తం పార్టీకి పెద్ద షాక్​ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి బీజేపీ తీర్థం పుచ్చుకుంది. విజయధరణి న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.అన్నామలై కండువాకప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే విజయధరణి రాకతో పార్టీ మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే విజయధరణి మాట్లాడుతూ.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు​ అన్నామలై ఆధ్వర్యంలో పార్టీలో చేరడం,రాష్ర్ట అభివృద్ధికి తోడవడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువని, దేశ భవిష్యత్తు, అభివృద్ధిపై ఆలోచన లేదని ధరణి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్​ తోనే ప్రారంభించానని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను చూసే బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. తాను పార్టీ మారడం మొదటిసారి అని అన్నారు. 
 
పెరుంతగైతో విబేధాలతోనే పార్టీ వీడిన విజయధరణి..
విజయధరణి 2021లో కన్యాకుమారి నుంచి కాంగ్రెస్​ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్​ పార్టీలో సీనియర్​ నేత సెల్వ పెరుంతగైతో ఉన్న విబేధాల కారణంగా ఆమె పలుమార్లు మనస్తాపానికి గురయ్యారు. పెరుంతగై రాష్​ర్ట అధ్యక్షుడిగా ఎన్నికకావడంతో ఆమె కాంగ్రెస్​ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈమె బీజేపీలో చేరడం హస్తం పార్టీకి రుచించడం లేదు.