కేరళలో 50వేల నకిలీ ఆధార్​ కార్డుల సృష్టి

శ్రీలంక, మయన్మార్​, బంగ్లాదేశీయుల శాశ్వత నివాసానికి యత్నం ఇంటలిజెన్స్​ నివేదికలో బహిర్గతం

May 8, 2024 - 15:30
 0
కేరళలో 50వేల నకిలీ ఆధార్​ కార్డుల సృష్టి

కొచ్చి: కేరళలో నకిలీ ఆధార్​ కార్డుల సృష్టి కలకలం సృష్టిస్తోంది. బంగ్లాదేశ్​, మయన్మార్​, శ్రీలంకలకు చెందిన 50వేల మందికి నకిలీ ఆధార్​ కార్డులు సృష్టించినట్లు ఇంటలిజెన్స్​ విభాగం పేర్కొంది. ఆధార్​ కేంద్రాల్లోని ఉద్యోగులే నకిలీ ఆధార్​ లకు సృష్టికర్తలని కూడా బుధవారం వెల్లడించిన నివేదికలో స్పష్టం చేసింది. 

కేరళలో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, మ‌య‌న్మార్‌కు చెందిన శ‌ర‌ణార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. భారత్​ లో శాశ్వత నివాసం ఏర్పుచుకునేందుకు శ‌ర‌ణార్థులు న‌కిలీ ఆధార్ కార్డుల‌ను సృష్టిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్​ వర్గాలు దీనిపై కూపీ లాగాయి. స‌మాచారం ఆధారంగా బోర్డ‌ర్ సెక్యూరిటీ ద‌ళం త‌న నిఘాను పెంచింది. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో మరింత నిఘాను పెంచారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ ఇండియ‌న్ కోస్టు గార్డులు నిఘాను పెంచారు. విదేశీయులు అక్ర‌మంగా కేర‌ళ‌లోకి చొర‌బ‌డుతున్న‌ట్లు ఏడాది క్రిత‌మే కేంద్ర నిఘా ఏజెన్సీలు వెల్ల‌డించాయి. మ‌ల్ల‌పురంలో ఉన్న ఆధార్ కేంద్రంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డి 50 ఆధార్ కార్డుల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బెంగాల్‌, ఝార్ఖండ్ నుంచి ఐపీ అడ్రెస్‌ల‌తో కేర‌ళ‌లో ఆధార్ కేంద్రాల‌ను హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. కేర‌ళ పోలీసులు వంద‌ల సంఖ్య‌లో న‌కిలీ ఆధారు కార్డుల‌ను సీజ్ చేశారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం న‌కిలీ కార్డు క‌లిగిన వారికి మూడేళ్ల జైలు, ల‌క్ష జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉన్నాయి. దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా నకిలీ ఆధార్లు సైతం తీసుకోవడంతో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్​ గా తీసుకుంది.