పెళ్లి వ్యాఖ్యలపై బద్రుద్దీన్​కు సీఎం శర్మ హెచ్చరిక

తాను పెళ్లి చేసుకునేందుకు ఇంకా ధృడంగానే ఉన్నానని ఏఐయూడీఎఫ్​ చీఫ్​బద్రుద్దీన్​ వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్​ ఇచ్చారు.

Mar 31, 2024 - 20:57
 0
పెళ్లి వ్యాఖ్యలపై బద్రుద్దీన్​కు సీఎం శర్మ హెచ్చరిక

డిస్పూర్: తాను పెళ్లి చేసుకునేందుకు ఇంకా ధృడంగానే ఉన్నానని ఏఐయూడీఎఫ్​ చీఫ్​బద్రుద్దీన్​ వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్​ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలని, యూసీసీ అమ్మల్లోకి వచ్చిన నేపథ్యంలో బహుభార్యత్వం చట్టవిరుద్ధం అవుతుందని తెలుసుకోవాలని శర్మ హెచ్చరించారు.  ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆదివారం బద్రుద్దీన్​ చేసిన వ్యాఖ్యలపై శర్మ కౌంటరిచ్చారు. ఆయన పెళ్లి చేసుకొని ఆహ్వానిస్తే తాము కూడా వెళతామని శర్మ అన్నారు. తనకు తెలిసినంత వరకు ఆయనక ఒకసారి వివాహం అయిందని కావాల్సివస్తే మరో రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చని ఎన్నికల తరువాత యూసీసీ రావడం తథ్యమన్నారు. అప్పుడు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని శర్మ వ్యాఖ్యనించారు. యూసీసీకి సంబంధించి ఇప్పటికే ముసాయిదా పూర్తి సిద్ధంగా ఉందని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.