స్పీకర్ పదవికి సురేష్ ప్రకటన ఏకపక్ష నిర్ణయమన్న టీఎంసీ
Suresh's announcement for the post of Speaker is a unilateral decision of the TMC
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లోక్ సభ స్పీకర్ పదవికి ప్రతిపక్షం తరఫున సురేష్ ను ప్రకటించడం తమకు తెలియదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఎంసీని సంప్రదించలేదన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ నేతలతోనూ కాంగ్రెస్ చర్చించలేదని ఒకింత ఆగ్రహంగానే మాట్లాడారు. సురేష్ ఎంపిక జరిగిన సమయంలో టీఎంసీ తరఫున ఎవ్వరూ లేరన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమే అవుతుందని బెనర్జీ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో తన వైఖరి కన్నా పార్టీ అధినేత మమత బెనర్జీ వైఖరే ముఖ్యమని అభిషేక్ తెలిపారు.