జ్ఞానవాసీపై ఏఎస్​ఐ, మసీదు కమిటీకి సుప్రీం నోటీసులు

Supreme notices to ASI and mosque committee on Gnanavasi

Nov 22, 2024 - 13:36
 0
జ్ఞానవాసీపై ఏఎస్​ఐ, మసీదు కమిటీకి సుప్రీం నోటీసులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాశీ విశ్వనాథుడు జ్ఞానవాపీ మసీదు కేసులో ఏఎస్​ఐ, మసీదు కమిటీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం కేసుపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జ్ఞానవాసీ మసీదు వజుఖానాలో సర్వే సందర్భంగా ఏఎస్​ ఐకి శివలింగం దొరికిందని ఈ విషయంపై రెండు వారాల్లోగా సీల్డ్​ కవర్​ లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. జ్ఞానవాపీపై దాఖలైన పలు పిటిషన్లను అన్నింటినీ ఏకీకృతం చేసి ఒకే కోర్టులో విచారణ జరపాలని కూడా పిటిషన్​ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్​ ను సుప్రీం డిసెంబర్​ 19కి వాయిదా వేసింది. పిటిషన్లను పరిశీలించిన మీదట విచారణ తేదీని నిర్ణయిస్తామని చెప్పింది.