సీఏఏపై స్టేకు అప్పీల్ సుప్రీం నిరాకరణ
సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏపై స్టే ఇవ్వాలని ముస్లింలీగ్ సహా కేరళ ప్రభుత్వం, మరికొంతమంది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

నా తెలంగాణ, ఢిల్లీ: సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏపై స్టే ఇవ్వాలని ముస్లింలీగ్ సహా కేరళ ప్రభుత్వం, మరికొంతమంది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అదే సమయంలో ఈ చట్టం అమలుపై 230 పిటిషన్లు దాఖలవడం పట్ల మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం నోటీసులిచ్చింది. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన నిర్ణయం, స్పందన తెలియజేయాలని సూచించింది. విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. సీఏఏతో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.