లెబనాన్ లో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
అండర్ గ్రౌండ్ లలో అడ్డాలు ఆధారాలతో సహా వివరాలందించిన ఐడీఎఫ్
బీరూట్: లెబనాన్ లోని ఐడీఎప్ అణువణువు శోధనలో దిమ్మదిరిగే విషయాలు వెలుగుచూస్తున్నాయి. గురువారం అర్థరాత్రి చేపట్టిన సెర్చింగ్ లో ఓ గ్రామంలో భారీ ఎత్తున ఆయుధాలు, గ్రేనేడ్లు, బాంబులు, రాకెట్ లాంచర్లు దర్శనమిచ్చాయి. ఈ ఉరు ఊరంతా అండర్ గ్రౌండ్ లలో ఈ ఆయుధాలు లభించాయి. వీటిని ఐడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. హమాస్ తరహాలోనే హిజ్భుల్లా ఇజ్రాయెల్ పై దాడులకు ప్రణాళిక రచించినా ఐడీఎఫ్ అప్రమత్తతో ఈ దాడి తప్పినట్లయ్యిందని అధికారులు పేర్కొన్నారు. దాడికి ముందే వీరి సాంకేతిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం, హమాస్, హిజ్బుల్లాకు చెందిన పెద్ద తలకాయలను మట్టుబెట్టడం, లెబనాన్ లో పెద్ద యెత్తున ఐడీఎఫ్ దాడులకు పాల్పడుతుండడంతో ఈ గ్రామాల్లో ఉన్న చాలామంది పారిపోయారని పేర్కొంది. తనిఖీల్లో భాగంగా ఈ భారీ ఆయుధ డంప్ లను గుర్తించామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.