నాగా సంస్కృతిలో స్వచ్ఛతపై ప్రధాని హర్షం

Prime Minister is happy about purity in Naga culture

Dec 5, 2024 - 16:07
 0
నాగా సంస్కృతిలో స్వచ్ఛతపై ప్రధాని హర్షం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాగా సంస్కృతి, సాంప్రదాయాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యతనీయడం అత్యంత హర్షణీయమని ప్రధాని మోదీ అన్నారు. గురువారం నాగాలాండ్​ పర్వదినం హార్న్​ బిల్​ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ర్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్నేళ్ళ క్రితం తాను ఈ ఉత్సవాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. నాగా ప్రజల చైతన్యం గొప్పదన్నారు. 

జూనియర్​ హాకీ టీమ్​ కు అభినందనలు..
జూనియర్​ హాకీ టీమ్​ ఆసియా కప్​ –2024 గెలుచుకోవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా టీమ్​ ను ప్రధానమంత్రి మోదీ అభినందించారు. భారత హాకీ ఛాంపియన్​ లను చూసి దేశం గర్వపడుతుందన్నారు. ఇది హాకీ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. నైపుణ్యం, టీమ్​ వర్క్​ తో విజయ స్ఫూర్తిని అందుకోగలిగారని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్​ లోనూ ఇలాంటి ఎన్నో విజయాలను భారత్​ కు అందించాలని అభిలషించారు. 

కేంద్రమంత్రికి మోదీ ప్రశంసలు..
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ రాజ్యాంగం ప్రాముఖ్యత, భారత విభిన్న సంస్కృతి, ఆధ్యాత్మికత, చారిత్రాత్మక వారసత్వంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మంత్రి భారత రాజ్యాంగం పట్ల ఎంత నిబద్ధతో ఉన్నారో? ఇది తెలియజేస్తుందన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ రాజ్యాంగంపై ఓ జాతీయ పత్రికలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ పత్రిక క్లిప్​ ను ట్వీట్​ చేస్తూ మంత్రిపై ప్రశంసలు కురిపించారు.