హస్తానికి సుచరిత ఝలక్​ పూరి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ

మే 6న నామినేషన్లకు చివరి గడువు పార్టీ ఫండ్​ ఇవ్వనందునే పోటీకి ససేమిరా దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్​ అధిష్టానం

May 4, 2024 - 13:12
 0
హస్తానికి సుచరిత ఝలక్​ పూరి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ

భువనేశ్వర్​: ఒడిశాలోని పూరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఆ పార్టీకి ఝలక్​ ఇచ్చారు. సుచరిత మొహంతి తనకు టికెట్​ వద్దని తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ కు లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున పార్టీ పరంగా అందాల్సిన డబ్బులు కూడా తనకు అందలేదని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూరి ఎంపీ స్థానం, ఒడిశా ఏడు అసెంబ్లీ స్థానాలకు 25న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్​ చివరి తేదీ మే 6 కావడం గమనార్హం. సుచరిత ఝలక్​ తో కాంగ్రెస్​ దిక్కుతోచని స్థితిలో పడింది. పూరి నుంచి ఇప్పటికే బీజేడీ అరూప్​ పట్నాయక్​, బీజేపీ నుంచి సంబిత్​ పాత్రలు బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. 

హస్తం పార్టీకి సూరత్​ లో కూడా ఇలాగే జరిగి అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణకు గురి కావడంతో ఆ స్థానం బీజేపీకి దేశంలోనే మొదటి సీటుగా ఏకగ్రీవమైంది. ఇక్కడి నుంచి ముఖేష్​ దలాల్​ ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. 

మధ్యప్రదేశ్​ ఇండోర్​ ఎంపీ స్థానం హస్తం అభ్యర్థి అక్షయ్​ కాంతి బామ్​ కూడా ఆ పార్టీకి ఝలక్​ ఇస్తే ఏప్రిల్​ 29న తన నామినేషన్​ ను ఉపసంహరించుకొని బీజేపీలో చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఆదిలోనే హస్తం పార్టీకి హంసపాదు ఎదురవుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆ పార్టీ అధిష్టానం పడింది.