సిరియాలో యుద్ధమేఘాలు అంతర్యుద్ధంలో ఆరుదేశాల ఎంట్రీ
War clouds six countries' entry into civil war in Syria
అల్ అసద్ ను గద్దె దింపడమే లక్ష్యంగా తిరుగుబాటు
అసద్ కు మద్దతిస్తున్న రష్యా, ఖమేనీ
తిరుగుబాటుదారుల వైపు టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్
సిరియా: ఓ వైపు ఉక్రెయిన్–రష్యా, ఇజ్రాయెల్ –హమాస్–లెబనాన్ ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందనగా సిరియాలో అంత్యర్యుద్ధం పేరుతో మహాప్రళయమే సంభవించేటట్లుగా ఉంది. ప్రజాస్వామ్యమే లక్ష్యంగా సిరియా అధ్యక్షుడు అల్ అసద్ ను గద్దె దించాలని తిరుగుబాటు యుద్ధం మొదలుపెట్టారు. తిరుగుబాటుదారులు ప్రధాన నగరమైన అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు అంతర్యుద్ధానికి ఆజ్యం పోసేలా సిరియా అధ్యక్షుడు అల్ అసద్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీలు తమ పూర్తి సహాయ సహాకారాలందిస్తున్నాయి. రష్యా 30వేల మంది సైనికులను రంగంలోకి దించగా, ఇరాన్ ఖమేనీ కూడా తమ సైన్యాన్ని సిరియా అసద్ కు మద్ధతుగా తిరుగుబాటును అణచివేసేందుకు పంపించారు.
మరోవైపు ప్రజాస్వామ్య తిరుగుబాటుకు మద్ధతుగా నిలుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, టర్కీ తిరుగుబాటు దారులకు మద్ధతుగా నిలుస్తూ సిరియాను కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సిరియాలో భారీ యుద్ధమేఘాలు అలముకున్నాయి. నిమిష నిమిషానికి భారీ బాంబులు, దాడులతో ప్రాంతమంతా దద్ధరిల్లుతోంది. తిరుగుబాటుదారులను తరిమికొట్టాలని అల్ అసద్ మంగళవారం సరిహద్దు వద్ద సైనికులను కలిసి ధైర్యం నూరిపోశారు.
ఈ నేపథ్యంలో సిరియాలోనే రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, ఇజ్రాయెల్, టర్కీ, సిరియా, తిరుబాటుదారులు ముఖాముఖి తలపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. సిరియాలో అంతర్గత తిరుగుబాటు శక్తులు విజృంభిస్తూ అల్ అసద్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు అన్ని రకాలుగా సిరియాకు అండదండలుగా నిలిచే హెజ్ బుల్లా నడ్డీని ఇజ్రాయెల్ విరిచింది. ఈ నేపథ్యంలో సిరియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.