ఉగ్రదాడులపై ఏడుస్తారా? జావాబిచ్చే సత్తా లేదా? కాంగ్రెస్​ తో ప్రధాని చెడుగుడు

జేఎంఎం, హస్తంకు చుక్కలు చూపిన ప్రజలు ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 4, 2024 - 12:55
May 4, 2024 - 16:44
 0
ఉగ్రదాడులపై ఏడుస్తారా? జావాబిచ్చే సత్తా లేదా? కాంగ్రెస్​ తో   ప్రధాని చెడుగుడు

రాంచీ: ఉగ్రదాడులపై ఏడిచే హస్తం ప్రభుత్వం ఒకవైపు మరోవైపు ఉగ్రదాడులు జరిగితే ధీటైన సమాధానం ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎక్కడని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దాడులు జరిగితే ప్రపంచదేశాలకు చెబుతూ ఏడుస్తారా? అని నిగ్గదీశారు. యువరాజు ప్రభుత్వం రావాలని నేడు పాక్​ నేతలు ప్రార్థిస్తుండడాన్ని మోదీ విమర్శించారు. కానీ భారత్​ ప్రజలు ప్రభుత్వాలు తీరును క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరని అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్​ లకు ప్రజలు ఇప్పటికే చుక్కలు చూపించారని పేర్కొన్నారు. 

జార్ఖండ్​ లోని పాలములో జరిగిన ఎన్నికల బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ప్రజాస్వామ్య శక్తి తెలిసొచ్చింది..

2014 తరువాత ఓటు ప్రాముఖ్యత అంటే ఏంటో విపక్షాలన్నింటికీ తెలిసొచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం శక్తిని మరలా ఓ మారు రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ తెలిపారు. భారత ప్రజాస్వామ్యానికి నేడు ప్రపంచదేశాలు సెల్యూట్​ చేస్తున్నాయని తెలిపారు. ఒక్క ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్​ లాంటి అవినీతి, అక్రమ ప్రభుత్వాన్ని గద్దెదింపారని అన్నారు.

ఓటు బలంతోనే రామ మందిర నిర్మాణం..

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆ ప్రజాస్వామ్య బలమే తమకు తోడ్పాటునందించిందన్నారు. రామ మందిర నిర్మాణం మీ ఓటుతోనే జరిగిందన్నారు. దేశభవిష్యత్​ కు పునాదులు కూడా వేస్తున్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

60ఏళ్లు దోచుకుతింటారా?

హస్తం పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని మోదీ అన్నారు. 60 ఏళ్లు దేశాన్ని దోచుకుతిన్న,పాలించిన ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు తెరలేపిందన్నారు. కాశ్మీర్​ లో రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉండేవన్నారు. 

ప్రజాస్వామ్య శక్తియే ఆర్టికల్​ 370క స్ఫూర్తి..

మోదీ ప్రభుత్వ హయాంలో ఓటు అనే ఆయుధం శక్తితోనే ఆర్టికల్​ 370ని రద్ధు చేశామన్నారు. ప్రజాస్వామ్య పునాదులను కాశ్మీర్​ లో పటిష్ఠం చేయగలిగామని తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదం నామరూపాల్లేకుండా పోయిందన్నారు. దేశంలోని ఏ ప్రాంతమైన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. కాశ్మీర్​ కుమంచి భవిష్యత్​ ఉందన్నారు. ఇప్పటికైనా కాశ్మీర్​ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మెలిగితే వారి భావితరాలకు శాంతి, అభివృద్ధి ఫలాలను అందించగలుగుతారని తెలిపారు. 

ఝార్ఖండ్​, చత్తీస్​ గఢ్​, ఒరిస్సా, ఆంధ్రాలో పశుపతి నాథ్​ ఆలయం నుంచి ఆంధ్ర ప్రాంతంలోని తిరుపతి వరకు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదం, నక్సలిజం ఎదిగేందుకు గత కాంగ్రెస్​ ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు.

ఉగ్రవాదం, నక్సలిజంలపై ఉక్కుపాదం..

బీజేపీ హయాంలో ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర పథకాల అందజేత కొనసాగిస్తామన్నారు. ప్రతీ నిరుపేద ఇంటివరకు మోదీ సంక్షేమ పథకాలు నేరుగా వెళ్లాల్సిందేనన్నారు. 

దాడులపై పాక్​ కు ప్రేమలేఖలా..

దేశంలో ఓ వైపు ఉగ్రదాడులు జరుగుతుంటే హస్తం ప్రభుత్వమేమో పాక్​ కు ‘ప్రేమలేఖ’లను (విజ్ఞప్తి పత్రాలను) పంపేదని విమర్శించారు. భారత్​ లో ఉగ్రదాడులు జరిగితే సమాధానం ఇచ్చే చేతకాని ప్రభుత్వాలు ఉన్నా, లేకున్నా ఒక్కటే అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకునే తప్పిదం చేయవద్దన్నారు. ఈ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు తెరతీస్తున్నాయని మోదీ తెలిపారు. 

సదా మీ సేవలో మోదీ..

పాక్​ యువరాజును ప్రధానిని చేయాలనుకుంటే విశాల భారత ప్రజాస్వామ్యం మోదీని మరోమారు ప్రధానిని చేయాలని సంకల్పించిందన్నారు. మోదీ సదా మీ సేవలో ప్రాణం ఉన్నంతవరకూ దేశం కోసం పాటుపడతాడని స్పష్టం చేశారు.

వీరిద్దరివి అక్రమాస్తులు.. తనది 140 కోట్ల కుటుంబం..

జేఎంఎం, కాంగ్రెస్​ లకు వారి కుటుంబీకులకు ఉన్నన్ని ఆస్తులు ఇంకెవరికైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తమ కుటుంబీకుల కోసం అవినీతి, అక్రమాలతో ఆర్జించిన సంపదను చూసి మురిసిపోతున్నారని మండిపడ్డారు. తనకు ఆస్తిపాస్తులు ఏమీ లేవన్నారు. ఒక సైకిల్, సొంతిళ్లు కూడా తనకు లేదన్నారు. మోదీకి 140 కోట్ల మంది కుటుంబీకులని మరోమారు పునరుద్ఘాటించారు.

రిజర్వేషన్ల పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తీరని అన్యాయాన్ని కాంగ్రెస్​ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.