క్షయ నివారణే లక్ష్యం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ 24న టీబీ నివారణ దినోత్సవం
నా తెలంగాణ, ఢిల్లీ: క్షయ వ్యాధి నివారణ(టీబీ)ని ముందస్తుగానే గుర్తించి చికిత్స ద్వారా నయం చేసుకోవడం ప్రస్తుత తరుణంలో సాధ్యమేనని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మార్చి 24 క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు. టీబీని ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. తొలుత నుంచే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమూలంగా క్షయవ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యాధి నిర్మూలనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.