యుద్ధం ముగింపునకు ట్రంప్​ తో చర్చలు: పుతిన్​

Talks with Trump to end war: Putin

Dec 19, 2024 - 18:46
 0
యుద్ధం ముగింపునకు ట్రంప్​ తో చర్చలు: పుతిన్​

మాస్కో: ఉక్రెయిన్​ తో యుద్ధం ముగించేందుకు డోనాల్డ్​ ట్రంప్​ తో చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రకటించారు. రష్​యా దళాలు లక్ష్యాలను సాధించే దిశగా కదులుతున్నాయన్నారు. గురువారం పుతిన్​ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ట్రంప్​ తో చాలాయేళ్లుగా తాను కలవలేదన్నారు. రష్యా ఇంకా బలమైన స్థితిలోనే ఉందన్నారు. చర్చలు, రాజీ, యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2012లో సిరియాలో కిడ్నాప్​ కు గురైన అమెరికా రిపోర్టర్​ ఆస్టిన్​ విషయంపై అల్​ అస్సాద్​, ఆదేశ నూతన నాయకులతో మాట్లాడే యోచనలో ఉన్నానన్నారు. ఆస్టిన్​ క్షేమాన్ని కోరుతున్నామన్నారు. తమ దేశ ప్రాథమిక హక్కులను కాపాడే దిశగా కదులుతామని పుతిన్​ చెప్పారు.  ఆర్థిక వ్యవస్థ, అధిక ద్రవ్యోల్బణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని కుర్క్స్​ ప్రాంతం నుంచి ఉక్రెయిన్​ బలగాలను ఖచ్చితంగా బయటకు పంపుతామన్నారు. ఆ ప్రాంతం నుంచి బలగాలు తప్పుకోకుంటే తమ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.