సీఎంపై ఈడీ కేసు నమోదు!

ED registered a case against the CM!

Sep 30, 2024 - 20:44
 0
సీఎంపై ఈడీ కేసు నమోదు!

బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త తరువాత ఈడీ (ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్​) సోమవారం కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈడీ కేసును దర్యాప్తు చేయనుంది. లోకాయుక్త సీఎం, ఇతరులపై మోసం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముడా (మైసూర్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ) ప్లాట్​​ కేటాయింపునకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు సీఎంపై కేసు నమోదైంది. ముడా ద్వారా 14 స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. 2011లో నిబంధనలు పక్కన పెట్టి తన సతీమణి పార్వతికి ఈ ప్లాట్​ లను కేటాయించారు. ఈ నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్​ చేస్తుంది. 

లోకాయుక్త నమోదు చేసిన కేసులో సిద్ధరామయ్య ఎ–1, ఎ–2గా పార్వతి, ఎ–3గా బావమరిది మల్లికార్జున స్వామి, భూమిని కొని సిఎంసతీమణి పేరిట మార్చిన దేవరాజ్​ అనే నిందితుడిని ఎ–4గా లోకాయుక్త చేర్చింది. 

కేసుల నమోదపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తనను చూసి భయపడుతున్నాయని ఆరోపించారు. ముడా కేసులో తనను టార్గెట్​ చేస్తున్నారని అన్నారు. న్యాయపరంగా పోరాడతానన్నారు.